ఆ మలుపులు.. ప్రమాదాలకు పిలుపులు..!
ప్రమాదాలు జరిగిన పట్టించుకోరా..?
బెజ్జూర్ సెప్టెంబర్ 20 (విజయ క్రాంతి ): ఆ మలుపులు ప్రమాదాలకు పిలుపులుగా మారాయి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానపల్లి (Chinthalamanapalli)మండలంలోని ఆడపల్లి అడవి ప్రాంతం నుండి కడంబా అడవి (Kadamba forest) ప్రాంతంలో మూల మలుపులతో ప్రమాదం పొంచి ఉందని ప్రయాణికులు తెలుపుతున్నారు. మూలమలుపుల ప్రాంతంలో సూచిక బోర్డులు లేకపోవడంతో పాటు, చెట్ల కొమ్మలు, పొదలు రోడ్లపై ఉండడంతో వాహనదారులకు రహదారి సరిగా కనిపించగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు.
రోడ్డుకు ఇరువైపులా వేసిన మట్టి సైతం సరి చేయకపోవడంతో ఇబ్బందిగా మారిందని ప్రయాణికులు వాపోతున్నారు. ఇట్టి విషయమై అధికారులు వెంటనే స్పందించి రహదారికి ఇరువైపుల మూలమరుపుల వద్ద ఉన్న చెట్ల పొదలు వెంటనే తొలగించి, మూలమలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.