వినాయక లడ్డు ను రూ. 55,555 లకు దక్కించుకున్న బిజెపీ ప్రధాన కార్యదర్శి చెల్లక శ్రీధర్
20-09-2026 | 06:54pm
ఘట్ కేసర్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): ఘట్ కేసర్ పట్టణంలోని బాలాజీ నగర్ లో శ్రీగణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన శ్రీ వినాయక స్వామి చేతిలో ప్రత్యేక పూజలు అందుకున్న మహా లడ్డూకు జరిగిన వేలం పాటలో పాల్గొన్న బిజెపీ ప్రధాన కార్యదర్శి చెల్లక శ్రీధర్(BJP General Secretary Chellaka Sridhar) రూ. 55,555 లకు దక్కించుకున్నారు. శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ శ్రీధర్ కుటుంబంపై ఉండాలని గణేష్ మండప నిర్వాహకులు కోరుకుంటున్నట్లు తెలిపారు.