పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలి: సుధాకీర్తి
20-09-2026 | 06:40pm
అల్వాల్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు రోజువారి ఆహారంలో తప్పనిసరిగా పౌష్టికాహారం(Nutritious food) తప్పనిసరిగా తీసుకోవాలని సూపర్ వైజర్ సుధాకీర్తి(Supervisor Sudha keerthi) అన్నారు. సీడీపీవో ఆదేశాల మేరకు శనివారం అల్వాల్ సెక్టార్ లోని శివానగర్ అంగన్ వాడి కేంద్రంలో పోషకాహారం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సుధాకీర్తి మాట్లాడుతూ పోషకాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ప్రతిరోజు పాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, చిరుధాన్యాలు వంటి ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు.