కులగణనలో బీసీ కాలమ్ ఏర్పాటు చేయాలి

20-09-2026 | 06:37pm

మల్కాజిగిరి, సెప్టెంబర్ 20, (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కులగణనలో బీసీ కాలమ్ ను తప్పని సరిగా ఏర్పాటు చేయాలని బీసీ సంఘం(BC Association) నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం  తెలంగాణ టూరిజం ప్లాజాలో నిర్వహించిన జాతీయ ఓబీసీ మహాసభకు  అన్ని రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన అధ్యక్షులు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. 

బీసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్(BC JAC National President Jajula Srinivas Goud) నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు వి. హనుమంతరావు,  రాష్ట్ర రవాణా శాఖ మంత్రిపొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ బీసీ అధ్యక్షుడు, తెలంగాణ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ సహకార సంఘం అధ్యక్షుడు, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ తాటికొండ శ్రీనివాసాచారి, కుల సంఘాల నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

మరిన్ని వార్తలు