రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
20-09-2026 | 01:18pm
లారీ ఢీకొని దుర్మరణం.. భర్తకు తీవ్ర గాయాలు
టేకులపల్లి,(విజయక్రాంతి): ఇల్లందు–కొత్తగూడెం జాతీయ రహదారిపై(Yellandu–Kothagudem National Highway) టేకులపల్లి మండలం సాయన్నపేట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఇల్లందు మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన దంపతులు గుగులోతు ఉమా (35), మోహన్ తమ కుమార్తెతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉమా తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త మోహన్‌కు తీవ్ర గాయాలు కాగా, కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై టేకులపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.