యాచకుడే.. కానీ ఆలోచన మాత్రం గొప్పది!

20-09-2026 | 11:48am

ఓ ప్రమాద గుంతపై అధికారులకు రాని ఆలోచన.. ఓ యాచకుడికి వచ్చింది! హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్(KBR Park) ప్రధాన రహదారిపై ఏర్పడిన భారీ గుంత ప్రమాదకరంగా మారింది. అధికారులు పట్టించుకోకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని భావించిన ఓ యాచకుడు ముందుకొచ్చాడు. తన వంతు బాధ్యతగా గుంతలో మట్టి పోసి పూడ్చే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

మరిన్ని వార్తలు