గణేశుడి మండపం వద్ద అన్నదానం నిర్వహిస్తున్న ఆర్యవైశ్య ప్రతినిధులు
20-09-2026 | 06:46pm
గణేషుడి వద్ద అన్నదానం.,..
తాడ్వాయి,సెప్టెంబర్,20( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం(Arya Vaishya Sangha) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేశుడి మండపం వద్ద ఆదివారం అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం కార్యక్రమాన్ని కొనసాగించారు. అన్నదానం మహా గొప్పదానమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు కిషోర్, వేణు, శశి బాబు తదితరులు పాల్గొన్నారు.