ఎస్సీ, ఎస్టీ కమిషన్ సమీక్ష సమావేశం నేపథ్యంలో నిర్ణయం

20-09-2026 | 06:46pm

రేపటి ప్రజావాణి రద్దు 

కలెక్టర్ అంకిత్

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ మరియు ఐదుగురు సభ్యుల బృందం ఈ నెల 21న జిల్లాలో పర్యటించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీలు, భూ సమస్యలు, ఆర్‌ఓఆర్ అమలు తదితర అంశాలపై జిల్లా అధికార యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో, ప్రతి సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రేపు (సోమవారం) రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అంకిత్(District Collector Ankit) ఒక ప్రకటనలో తెలిపారు.

కమిషన్ సమీక్ష సమావేశానికి జిల్లా స్థాయి అధికారులు, సంబంధిత శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ తెలిపారు . కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి, రేపు ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావద్దని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు.

మరిన్ని వార్తలు