సూర్యాపేట వద్ద ఘోర ప్రమాదం.. ఖమ్మం డాక్టర్ సజీవదహనం

20-09-2026 | 01:16pm

ఖమ్మం, విజయక్రాంతి: ఖమ్మం జిల్లా, ఖమ్మం నగరంలోని మమత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి(Mamata Super Speciality Hospital)లో న్యూరో సర్జన్ వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ కాసకుర్తి జగదీష్ ఆదివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తున్నా ఆయన మార్గం మధ్యలోని పిల్లల మర్రి సమీపంలో సూర్యాపేట -ఖమ్మం 365 హైవేలో ఘోర ప్రమాదం(Road Accident) జరిగింది. డివైడర్ ను ఢీకొట్టిన వోల్వో కారు, వెంటనే కారుకు మంటలు అలుముకున్నాయి. కార్లో ఉన్న డాక్టర్ జగదీష్ మంటల్లోనే సజీవ దహనం అయ్యాడు. సమాచారం అందుకున్న స్థానిక  పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  రోడ్డు ప్రమాదంలో డాక్టర్ చనిపోవడంతో ఖమ్మం జిల్లా వైద్యులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సంతాపం ప్రకటించారు.

మరిన్ని వార్తలు