జాబ్ మేళా విజయవంతానికి కృతజ్ఞతలు: సర్పంచ్

20-09-2026 | 06:11pm

కోదాడ (నడిగూడెం) సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): ఈ నెల 19 న కోదాడలో సి.సి.రెడ్డి కాన్వెంట్ పాఠశాలలో నిర్వహించిన జాబ్ మేళా ను  విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి  కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు నడిగూడెం గ్రామ సర్పంచ్ దున్నా శ్రీనివాస్ తెలిపారు.

ఆదివారం మండల కేంద్రంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రివర్యులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల సౌజన్యంతో నిర్వహించిన జాబ్ మేళాను పూర్తిస్థాయిలో విజయవంతం చేసిన  వివిధ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులకు, అన్ని డిపార్ట్ మెంట్ ల ఉద్యోగ బాధ్యులకు, వివిధ రకాల కమిటీ బాధ్యులకు, ఉత్సాహంగా పాల్గొన్న నిరుద్యోగ యువతి యువకులకు, వివిధ స్థాయిలో ఉన్న పార్టీ ప్రతినిధులకు, మాజీ ప్రజా ప్రతినిధులకు, పాత్రికేయ సోదరులకు హాజరైన వివిధ కంపెనీల ప్రతినిధులకు, అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు