దానంకు ఉపఎన్నికలు కలిసిరావు

20-09-2026 | 12:57pm

దానంకు ఉప ఎన్నికలు కలిసిరావు

దానంపై రఘునందన్ రావు విమర్శలు

హైదరాబాద్: దానం నాగేందర్ పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(BJP MP Raghunandan Rao) విమర్శలు చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే దానం అందులో చేరుతారని ఆరోపించారు. తెలుగు దేశం పార్టీ నుంచి కాంగ్రెస్.. అక్కడి నుంచి బీఆర్ఎస్.. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్(Congress)కు వచ్చారని విమర్శించారు. గత ఉప ఎన్నికల్లో దానం నాగేందర్ ఓడిపోయారని స్పష్టం చేశారు. దానంకు ఉప ఎన్నికలు కలిసిరావని జోస్యం చెప్పారు. ఖైరతాబాద్(Khairatabad by-elections)లో బీజేపీనే గెలుస్తుందని రఘునందన్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతల బస్సు యాత్ర(Congress leaders bus yatra) అధికార దుర్వినియోగమేనని ఆయన సూచించారు.

ప్రభుత్వమే వారిదైనప్పుడు రికార్డులు తెప్పించుకుని చూసుకోవచ్చుకదా అన్నారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు(Bulletproof vehicles) అవసరమా? అని ప్రశ్నించారు. ఇంత భయపెడుతూ పరిపాలన ఎందుకు అవసరమా? ఇది భయమా.. అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్సా? అని ప్రశ్నించారు. తెలంగాణ హైకోర్టు(Telangana High Court) తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేశానని దానం నాగేందర్(Danam Nagender) తెలిపారు. స్పీకర్, హైకోర్టు ఇచ్చిన తీర్పును క్రాస్ చెక్ చేసుకుని సుప్రీంను ఆశ్రయించినట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పువచ్చాక స్పందిస్తానని సూచించారు.


మరిన్ని వార్తలు