సెమీఫైనల్లో యువ భారత్
- ఆర్యవీర్ సెహ్వాగ్ విధ్వంసం
- యూఏఈపై ఘనవిజయం
- అండర్ ఆసియాకప్
ఒమన్, నవంబర్ 10: అండర్ 19 ఆసియాకప్‌లో(Under-19 Asia Cup) భారత్ సెమీఫైనల్‌కు దూసుకె ళ్లింది. గత మ్యాచ్‌లో పాక్‌పై పరాజయం పాలైన భారత యువ జట్టు యూఏఈపై మాత్రం అదరగొట్టింది. సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ విధ్వంసకర శతకానికి తోడు బౌల ర్లు కూడా సమిష్టిగా రాణించడంతో భారీ విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ జట్టులో ఆర్యవీర్ సెహ్వాగ్ బ్యాటింగే హైలైట్.
ఓపెనర్ లక్ష్య రాజేష్ 17 పరుగులకే ఔటైనా వినీత్‌తో కలిసి ఆర్యవీర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ ఆరంభంలో ఆర్యవీర్ ఆచితూచి ఆడాడు. తొలి పరుగులు చేసేందుకు 14 బంతులు తీసుకున్నాడు. క్రీజులో కుదురుకున్నాక మాత్రం ప్రత్యర్థి బౌ లర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 69 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన అతను 131 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అనంతరం దూకుడుగా ఆడి మరో 29 బం తుల వ్యవధిలోనే 150 పరుగుల మార్క్ చేరుకున్నాడు. 17 ఫోర్లు, 7 సిక్సర్లతో చివర కు 168 బంతుల్లో 160 పరుగులు చేసి ఔటయ్యాడు. 153 పరుగుల వద్దే ఈ టోర్నీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యా టింగ్ చేసిన భారత అండర్ 19 టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 309 పరుగుల భా రీ స్కోర్ చేసింది.
ఆర్యవీర్ సెహ్వాగ్‌తో పాటు వీకే వినీత్(69 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 67) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్ద రూ మూడో వికెట్కు 193 పరుగులు జోడించారు. అనంతరం యూఏఈ నిర్ణీత 50 ఓవర్లలో 239 పరుగులకు కుప్పకూలింది. భారత బౌలర్లలో ఇషాన్ సూద్ (4/37) నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.