ఓయూ రూ. వెయ్యి కోట్లు ఎక్కడ?

11-11-2026 | 05:15am
  1. ప్రభుత్వానికి వీసీ గులాంగిరి
  2. నాన్ టీచింగ్ స్టాఫ్ సమస్యలపై గవర్నర్ స్పందించాలి
  3. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీకి(Osmania University) ఇస్తా నన్న రూ.వెయ్యి కోట్లు ఎక్కడ అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) ప్రభు త్వాన్ని ప్రశ్నించారు. నాన్ టీచింగ్ సిబ్బంది శ్రమను దోచుకుంటున్నారని మండిపడ్డా రు. ఉద్యోగులను ఆదుకునేందుకు వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జాడలేకుండాపోయాడని విమర్శించారు.

తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఓయూ నాన్ టీచింగ్ స్టాఫ్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ భవనం వద్ద చేపట్టిన ఆందోళనకు కవిత మంగళవారం మద్దతు ప్రకటించారు. 35 ఏళ్లుగా ఉస్మానియాలో నాన్ టీచింగ్ స్టాఫ్‌కు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉండటం క్షమించరాని నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాన్ టీచింగ్ ఉద్యోగులంతా సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే అండగా ఉండాల్సిన వీసీ.. ప్రభుత్వానికి గులాంగిరి చేస్తున్నారని కవిత మండిపడ్డారు. నిధులు ఇవ్వకుండా వీసీని బలి చేసే ప్రయత్నం చేస్తున్నారా? లేదంటే వీసీయే ప్రభుత్వం కోసం ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నాడా అని ప్రశ్నించారు. నాన్ టీచింగ్ స్టాఫ్ సమస్య లపై వర్సిటీ చాన్సలర్‌గా ఉన్న గవర్నర్ జోక్యం చేసుకోవాలని కవిత కోరారు.

ఓయూలో 85 శాతం లోకల్ వాళ్లనే నియమించుకోవాల్సి ఉన్నప్పటికీ బీహార్, యూపీ వాళ్లను సెక్యూరిటీ కోసం నియమిస్తున్నారన్నారు. యూనివర్సిటీలో జరిగే అవినీతి బయట పడకుండా ఉండేందుకే బయట వాళ్లను నియమిస్తున్నారా అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అన్నింటిపై గవర్నర్ విచారణ చేపట్టి సమస్యలు పరిష్కరించాలని కోరారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు శ్రీకాంత్ గౌడ్, ఆకాష్‌లకు అండగా నిలవాలని ఉద్యోగులకు కవిత విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు