ఫీనిక్స్ ఇన్విటేషనల్ టోర్నీ షురూ

11-11-2026 | 05:15am

ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్(Indian Golf Premier League) సందడి మళ్లీ హైదరాబాద్‌లో మొదలైంది. హైదరాబాద్ ఫైర్‌బ ర్డ్స్ జీసీ సమర్పణలో వూటీ గోల్ఫ్ కౌంటీ వేదికగా ’ఫీనిక్స్ ఇన్విటేషనల్ 2026’టోర్నమెంట్ ప్రారంభం కానుంది. బుధవారం నుండి శుక్రవారం వరకూ ఈ టోర్నీ జరుగుతుంది. ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన ట్రోఫీని నిర్వాహకులు ఆవిష్కరించారు.

హైదరాబాద్ ఫైర్‌బర్డ్స్ జట్టుకు కీలకంగా ఉన్న బైసోయా ప్రధాన టోర్నమెంట్‌తో పాటు ఈ వారం చివర్లో బౌల్డర్ హిల్స్లో జరగనున్న లీగ్ సరికొత్త ఫార్మాట్ ఎక్స్-గోల్ఫ్ కోసం తన జట్టు సభ్యులైన రంజిత్ సింగ్, రాఘవ్ చుగ్ మరియు అర్జున్ భాటిలతో కలిసి బరిలోకి దిగనున్నారు.

ఈ ఏడాది ఆరు అంతర్జాతీయ వేదికలతో సహా ఈ లీగ్ ఇప్పటివరకు 10 ఈవెంట్లను విజయవంతంగా పూర్తి చేసుకుందని ఐజీపీఎల్ సీఈఓ ఉత్తమ్ సింగ్ ముండీ చెప్పారు. ఈ లీగ్-ఇంటిగ్రేటెడ్ టూర్ ద్వారా పురుషులు, మహిళా ప్రొఫెషనల్ గోల్ఫర్లు ఇద్దరూ సమాన ప్రైజ్ మనీ కోసం పోటీపడేలా ఒకే వేదికపైకి వస్తున్నారని తెలిపారు. 


మరిన్ని వార్తలు