10 వేల ఫార్మసీ సీట్లు కేటాయింపు

22-09-2026 | 05:00am

ఎప్‌సెట్ తొలివిడతలో అభ్యర్థులకు.. 

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): ఎప్‌సెట్(EAPCET) బైపీసీ తొలివిడత సీట్లను అభ్యర్థుల(Candidates)కు సోమవారం కేటాయించారు. మొత్తం 10,612 సీట్లకు గానూ 10,061 సీట్లు కేటాయించారు. ఇంకా 551 సీట్లు మిగిలాయి. 95 శాతం సీట్లు కేటాయించారు. ప్రభుత్వ కాలేజీలు(Government colleges), ప్రభుత్వ వర్సిటీ(Government university)లో 100 శాతం బీ ఫార్మసీ సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తంగా బీఫార్మసీ సీట్లు(B Pharmacy seats) 94 శాతం, ఫార్మ్‌డీ సీట్లు 99 శాతం, బయోమెడికల్ సీట్లు 100 శాతం, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్(Pharmaceutical Engineering) సీట్లు 95 శాతం, బయోటెక్నాలజీ సీట్లు 100 శాతం నిండినట్లు అధికారులు తెలిపారు. ఈనెల 30 నుంచి అక్టోబర్ 1 వరకు సీటు పొందిన అభ్యర్థులు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలన్నారు.

మరిన్ని వార్తలు