రెండు రోజు నాలుగు పతకాలు
- 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో హిమాంశుకు రజతం.. రుద్రాంక్ష్‌కు కాంస్యం
- ఎంఎంఏలో భారత్‌కు తొలి పతకం
- ఆసియా క్రీడల్లో మొత్తం ఆరుకు చేరిన పతకాలు
నగోయా, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): ఆసియా క్రీడ(Asian Games)ల్లో భారత షూటర్లు(Indian shooters) సత్తా చా టారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో హిమాంశు ధిల్లాన్(Himanshu Dhillon) రజ తం, రుద్రాంక్ష్ పాటిల్ కాంస్యం సాధించారు. అంతకుముందు హిమాంశు, రుద్రాం క్ష్, 18 ఏళ్ల పార్త్ మానే కలిసి ఇదే విభాగం టీమ్ ఈవెంట్లో రజతం గెలిచారు. దీంతో షూటింగ్‌లో భారత్ పతకాల సంఖ్య ఐదుకు చేరింది. మొత్తం ఖాతాలో నాలుగు రజతా లు, ఒక కాంస్యం ఉన్నాయి.
టీమ్ ఈవెంట్‌లో చైనా 1899.0 పాయింట్లతో స్వర్ణం గెలిచి.. గతేడాది కైరోలో నెలకొల్పిన 1898. 4 ప్రపంచ రికార్డును మెరుగుపరిచింది. దక్షిణ కొరియా 1884.2 పాయింట్ల తో కాం స్యం సాధించగా.. భారత్ 1890.1 పాయింట్లతో రజతం దక్కించుకుంది. వ్యక్తిగత అర్హత పోటీలో రుద్రాంక్ష్ 631.8 పా యింట్లతో మూడో, హిమాంశు 630.0తో ఏడో స్థానంలో నిలవగా.. పార్త్ 628.3 పా యింట్లతో టాప్ ఎనిమిదిలో చోటు దక్కించుకో లేకపోయాడు.
మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో తొలి పతకం
ఆసియా క్రీడల్లో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్(Mixed Martial Arts) లో భారత్‌కు తొలి పతకం లభించింది. మహిళల 60 కిలోల విభాగంలో సుచికా తారియాల్(Suchika Tariyal)కు నిరాశ ఎదురైంది. సింగపూర్ క్రీడాకారిణి హుయ్ హూన్ టియోతో జరిగిన సెమీఫైనల్ పోరు డ్రాగా ముగిసినా.. ఉదయం బరువు కొలతల్లో టియో 700 గ్రాములు తక్కువగా ఉండటంతో నిబంధనల ప్రకారం ఆమెను విజేతగా ప్రకటిం చారు. దీంతో సుచికా కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.