రోడ్డుపై మృత్యుశకటం.. అధికారుల నిర్లక్ష్యం

22-09-2026 | 05:00am
  1. రహదారిపై అడ్డంగా పశువులు.. పక్కనే భారీ వాహనాల రాకపోకలు
  2. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయం.. 
  3. పట్టించుకోని అధికారులు

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్  21 (విజయక్రాంతి): పట్టణంలోని ప్రధాన రహదారుల(Main roads)పై పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయి. రహదారిపై పశువులు విచ్చలవిడిగా సంచరిస్తుండటంతో వాహనదారులు(Motorists) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో భారీ గూడ్స్ వాహనాలు(Goods vehicles), ద్విచక్ర వాహనాలు(two-wheelers) రాకపోకలు సాగిస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. చిత్రంలో రహదారి మధ్యలోనే పశువులు పడుకుని ఉండగా, వా టిని తప్పించుకుంటూ వాహనాలు ప్రయాణిస్తున్న దృశ్యం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా భారీ వాహనాల రాకపోకల సమయంలో పశువులు అకస్మాత్తుగా రోడ్డుపైకి రావడం ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. 

పట్టించుకోని అధికారులు, ప్రజలకు ఇబ్బందులు..

పట్టణంలో పశువుల సంచారాన్ని నియంత్రించడంతో పాటు రహదారులపై భద్రతా చర్యలు(Safety measures) చేపట్టాల్సిన అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రహదారి పక్కనే ట్రాఫిక్ పోలీసుల బారికేడ్లు(Traffic police barricades) ఉన్నప్పటికీ, రహదారిపై పశువుల సమస్య మాత్రం కొనసాగుతుండటంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తునా ్నరు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాకుండా ముందుగానే చర్యలు తీ సుకోవాలని, రహదారిపై పశువుల సంచారా న్ని అరికట్టి వాహనదారుల భద్రతకు చర్య లు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు