అక్టోబర్ ఆఖరున ఏమో ఏమో ఇది
22-09-2026 | 05:20am
రోషన్ మేక(Roshan Meka), ప్రీతి ముకుందన్(Preethi Mukundan) జంటగా నటిస్తున్న చిత్రం ‘ఏమో ఏమో ఇది’. ‘హిట్’ ఫ్రాంచైజీతో బ్లాక్బస్టర్ విజయాలను అందుకున్న రచయిత, దర్శకుడు శైలేశ్ కొలను(Sailesh Kola) తొలిసారి ఓ ఆహ్లాదకరమైన ప్రేమకథతో వస్తుండటం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తనదైన థ్రిల్లర్ కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, తాజాచిత్రంతో పూర్తిగా భిన్నమైన కథా ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ చిత్రాన్ని 2026 అక్టోబర్ 30న థియేటర్లలో విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్; డీవోపీ: వంశీ పచ్చిపులుసు.