పసిడినా.. గిల్ట్ గోల్డా?
- బ్యాంక్ అధికారుల పాత్రపై పలు అనుమానాలు
- బినామీల పేరుతో వ్యాపారుల దందా
- సుబ్రహ్మణ్యం తాకట్టుపెట్టిన వాటిలో రూ.2 కోట్లు బంగారం వర్తకులదే..
- టర్నోవర్, పన్నుల ఎగవేత కోసమే బినామీల ద్వారా లావాదేవీలు
- ఖాతాదారుల బంగారానికి ఏదీ భద్రత ?
అశ్వారావుపేట, సెప్టెంబరు 21 (విజయక్రాంతి): రూ. 10 కోట్ల గోల్ కుంభకోణం(Gold Scam) లో అసలు బంగారం ఎంతా, గిల్ట్ బంగారం ఎంతా ? తాకట్టు పెట్టింది అసలు బంగారమేనా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకులో చిరుద్యోగిగా పనిచేస్తూ అనేక మంది బంగారాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా తాకట్టు పెట్టుకొని.. బినామీల పేరుతో ఆ వస్తువులను సీఎస్బీ, శ్రీరామ్ ఫైనాన్స్(Shriram Finance) తో పాటు మరికొన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రెట్టింపు సొమ్ములు తీసుకున్న లింగిశెట్టి నాగ సుబ్రహ్మణ్యం(Lingishetti Naga Subrahmanyam) బాగో తంలో రోజుకో ఆసక్తికరమైన విషయాలు బయట పడుతున్నాయి.
ఆయన అక్రమ లావాదేవీలు రూ.10కోట్లకు పైనే జరిగాయన్నది తెలి సిందే. గతంలో ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ(Private finance company)లో సుదీర్ఘకాలం పాటు పనిచేసిన సుబ్రహ్మణ్యంకు.. బంగారం, ఫైనాన్స్ దుకాణదారులతో విస్తృత సంబంధాలు ఉన్నాయి. అందరికీ నమ్మకస్థుడిగా పేరొందాడు. గత రెండు మూడు రోజులుగా బంగారం తాకట్టులో జరిగిన మాయా జాలంలో పట్టణానికి చెందిన ఐదారుగురు బంగారపు దుకాణాదారు లకు సంబంధించి బంగారం ఉన్నట్టు బహిర్గతమైంది.
బంగారం వర్తకులు, ఫైనాన్స్ సంస్థలకు చెందిన బంగా రమే దాదాపు రెండు కోట్ల రూపాయలకు పైగా ఈ వ్యవహారంలో ఉన్నట్టు తేలింది. ఈ మొత్తం వ్యవహారాన్ని లోతుగా పరిశీలిస్తే.. పట్టణానికి చెందిన పలువురు బంగారం దుకాణాదారులు. ఫైనాన్స్ సంస్థలు.. సుబ్రహ్మణ్యంతో పాటు మరికొంత మందిని బినామీలుగా ఉపయోగించుకొని రూ. కోట్లల్లో అక్రమ లావాదేవీలకు పాల్పడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రజలు తమ అవసరాల కోసం ఫైనాన్స్, బంగారం వ్యాపారుల వద్ద తాకట్టు పెట్టిన తమ వస్తువులను సదరు వ్యాపారులు..
అధిక వడ్డీ, టర్నోవర్‌లో కనిపించ కుండా ఉండేందుకు, పన్నులు ఎగ్గొట్టేందుకు బినామీల ద్వారా ప్రైవేటు బ్యాంకులలో, ఇతర లావాదేవీలలో పెడుతున్నట్టు తెలుస్తోంది. సుబ్రహ్మణ్యం ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే సదరు వ్యాపారులు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొందరు మద్యవర్తుల ద్వారా సుబ్రహ్మణ్యంతో మాట్లాడిం చారు. తాము ఇచ్చిన బంగారపు వస్తువులు ఎక్కడ తాకట్టు పెట్టారో అని తెలు సుకొని శనివారం మధ్యాహ్నం లోపే విడిపించుకొని వెళ్లిపోవడం పట్టణంలోబి చర్చనీయాంశంగా ఉంది.
ఈ లావాదేవీలను చూస్తుంటే.. అవసరాల కోసం వ్యాపారుల వద్ద తాకట్టు పెట్టిన వస్తువులకు భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన మాత్రమే. ఇలాంటి బినామీలు ఎంత మంది ఉన్నారో.. ఎన్ని చోట్ల అక్రమ లావాదేవీలు జరుగుతున్నాయో అన్న విషయమై విచారణ జరిపితేనే తెర వెనుక వ్యవ హారం వెలుగులోకి వస్తుంది. ప్రభుత్వ లెక్కలకు దొరక్కుండా, ట్యాక్స్‌ల నుంచి తప్పించుకునేందుకు, అధిక వడ్డీలను పొందేందుకు వ్యాపారులు ఈ అక్రమ వ్యాపారాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా వ్యాపారులు తాము తాకట్టు పెట్టుకున్న వస్తువులను లాకర్లలోనో, బ్యాంకులోనో తాకట్టు పెట్టి సొమ్ము రొటేషన్ చేస్తుంటారు. ఈ టర్నోవర్ అంతా లెక్కల్లోకి వస్తుంది. ఈ లెక్కల నుంచి తప్పించుకోవడానికి, అనుమతుల్లేని అనేక వ్యాపార లావా దేవీల కోసం వ్యాపారులు బినామీలను ఉపయోగించుకుంటుంటారు. మరో వైపు.. సుబ్రహ్మణ్యం చేతిలో మోసపోయిన ఖాతాదారుల బంగారానికి భద్ర తతో పాటు భరోసా లేకుండా పోతోంది.
అంతా జీరో వ్యాపారమే..
అశ్వారావుపేటలో బంగారపు దుకాణాలు, కొందరు ఫైనాన్స్ వ్యాపారులు.. ప్రభుత్వ లెక్కల్లోకి రాకుండా ఉండేందుకు బినామీల ద్వారా జీరో వ్యాపార లావాదేవీలు జరుపుతున్నారు. బంగారపు వస్తువుల అమ్మకం సమయంలో కూడా ఏ ఒక్క వ్యాపారి బిల్లు ఇవ్వడు. ఎన్ని లక్షల వస్తువులనైనా తెల్లకాగి తంపైనే లెక్కరాసి ఇస్తారు. పట్టణంలో చాలా దుకాణాదారులకు బంగారం అమ్మే లైసెన్సులు, హాల్‌మార్క్ లైసెన్సులు ఉండవు. వీరంతా బంగారాన్ని ఆర్జ ్ప తెప్పించి ఇవ్వడం తప్పా. నేరుగా అమ్మే అనుమతులు చాలా మందికి లేవు.
బిల్లులు లేకుండా ఎన్ని కోట్ల వ్యాపార లావాదేవీలైనా జీరోలోనే జరుగు తాయి. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం వస్తోంది. ఇప్పటికైన అధికారులు మేల్కొని, అసలు ఈ బ్యాంకు లకు అనుమతులు ఉన్నాయా, ఉంటే ఎటువంటి అనుమతులు ఉన్నాయి ఆర్ బి ఐ నిబంధనలు బ్యాంకులు పాటిస్తున్నాయా తేల్చాలి. ఖాతా దారులను కూడా గుర్తించలేని స్థితి లో బ్యాంక్ అధికారులు, రూ. 10 కోట్ల కుంభకోణానికి బాధ్యులు ఎవ్వరు, అసలు పోలీసులకు పిర్యాదు చేసారా, చేయకపోతే కారణాలు ఏమిటి అనేది తెలియాల్సి ఉంది.