అంతా తగలపడిపోతది.. ఇది జడల్‌గాని వాదా!
నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్(Pan-India period action film) ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్(The Paradise)’. శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో, ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్‌లో సోమవారం ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్(Movie Pre-release Event) నిర్వహించారు. ఈ వేడుకలో కథానాయకుడు నాని మాట్లాడుతూ.. “సినిమా ఒక సెలబ్రేషన్‌లాగా ఉండబోతుంది. థియేటర్లు ఊగిపోతాయి. సెలబ్రేషన్ చూడ్డానికి నేను ఎదురుచూస్తున్నా. మనం ఎదుగుతుంటే మన చుట్టూ పాజిటివిటీతోపాటు నెగెటివిటీ కూడా పెరుగుతుంది.
నెగెటివ్‌ను కాకుండా పాజిటివ్‌ను పట్టుకొని మనం ముందుకువెళ్లాలి. మనం గెలవాలని కోరుకున్న వాళ్లు పెరిగినట్టే, మనం ఓడిపోతే చూద్దామనుకునేవాళ్లు కూడా పెరుగుతారు. నేను గెలుస్తానని నమ్మే వాళ్లను గెలిపించడానికి నేను కష్టపడుతూనే ఉంటా. మీరు (అభిమానులు) నాకు 100 ఏళ్లకు సరిపడా ప్రేమను ఇచ్చారు.. మనల్ని ఎవరూ ఆపలేరు. నా నమ్మకం మీద మీ అందరికీ చాలా నమ్మకం ఉందని నాకు తెలుసు. ఆ నమ్మకంతో చెప్తున్నా.. 23 రాత్రి నుంచి థియేటర్లో సెలబ్రేషన్స్ ప్రారంభమ వుతున్నాయి.
సినిమా మొదలైనప్పుడే జడలకూ ప్రేక్షకులకు ఒక లాక్ పడుతుంది. అప్పుడు అంటుకునేది వైల్ ఫైర్. శ్రీకాంత్ మాటల్లో చెప్పాలంటే తగలబడిపోతుంది. ఇది జడల్ గానీ వాదా” అన్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. “నాని ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, ‘ప్యారడైజ్’తో ఒక స్టార్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘ఇరుముడి’ నైజాంలో 50 కోట్లు మార్క్ టచ్ చేసింది. ఈ సినిమాతో నాని కూడా నైజాంలో 50 కోట్లు క్రాస్ చేయబోతున్నారు” అని తెలిపారు.
హీరోయిన్ కయాదు లోహర్ మాట్లాడుతూ.. “అందరితో కలిసి సినిమా చూడటానికి ఎదురుచూస్తున్నా. ‘ప్యారడైజ్’ నాకు చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. నానితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. అందరూ నానిని బిగ్‌స్క్రీన్ మీద చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. మా ఇద్దరి జోడి కూడా అందరికీ నచ్చుతుంది. 24న జడల్ జమానా మొదలు కాబోతుంది” అని చెప్పింది. నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ.. “మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. మా ‘ప్యారడైజ్’ కూడా ఒక మ్యారేజ్ లాంటిదే.
ఈ మ్యారేజ్‌ను సెట్ చేయడానికి అందర్నీ ఒకచోటికి కలిపాం. ఇప్పుడే సినిమా చూసి వచ్చా. బొమ్మ బ్లాక్బస్టర్” అన్నారు. గీత రచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. “శ్రీకాంత్ చాలా అద్భుతమైన ఇంటెన్సిటీతో ‘ప్యారడైజ్’ కథ చెప్పాడు. ఇందులో ‘ఆయా షేర్’, ‘ఏష నాగుల కట్ట’ పాటలు రాశా. నాని చాలా హార్డ్ వర్క్ చేశారు. తను నిజంగా షేర్. సినిమా మీరు ఎంత ఊహించుకున్నా అంతకు రెట్టింపుగా ఈ సినిమా ఉంటుంది. మొదటి నుంచి చివరి వరకు ఊగిపోతాం. సినిమా థియేటర్స్ డ్యాన్స్ ఫ్లోర్‌గా మారిపోతాయి” అని తెలిపారు.
నటుడు సంపూర్ణేశ్‌బాబు మాట్లాడుతూ.. “నేను చేసిన పెద్ద సినిమా ఇది. నానితో కలిసి పనిచేయడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. చాలా విషయాలు నేర్చుకున్నా. పొట్టుపొట్టు ఆకలి ఉంది. 24న ఆకలి తీరబోతుంది” అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్రంలోని నటీనటులు రాఘవ్, సోనాలి కులకర్ణిలతోపాటు రామ్‌లక్ష్మణ్ మాస్టర్స్, ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా, సింగర్స్ జంగిరెడ్డి, ప్రభ, టాలీవుడ్ నిర్మాతలు సాహు గారపాటి, రవిశంకర్, నవీన్ ఎర్నేని కూడా ఈ వేడుకలో మాట్లాడారు. సినిమా యూనిట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు.