కెప్టెన్‌గా కమిన్సే!
వివాదం మళ్లీ రాజుకున్నా.. కమిన్స్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా అండ!
ఆస్ట్రేలియా క్రికెట్‌లో 2018 బాల్ ట్యాంపరింగ్ వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై మాజీ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా తన Autobiographyలో వెల్లడించిన విషయాలతో క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ పరిణామాల నేపథ్యంలో టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్ పదవికి ముప్పు తప్పదనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, క్రికెట్ ఆస్ట్రేలియా (CA) మాత్రం అతడికి పూర్తి మద్దతుగా నిలిచింది.
కమిన్స్‌ను టెస్ట్ కెప్టెన్‌గా కొనసాగించడంపై తమకు నమ్మకం ఉందని బోర్డు స్పష్టం చేసింది. దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా 2018లో చోటుచేసుకున్న Sandpaper Controversyపై ఇటీవల మళ్లీ చర్చ మొదలవడంతో CA Board సమావేశమైంది. ఆస్ట్రేలియా క్రికెట్ ప్రతిష్ఠను కాపాడటంతో పాటు, ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అవసరమైన చర్యలు తీసుకోవడంపై చర్చించింది.
ఈ వివాదంపై వస్తున్న Speculation మధ్య కమిన్స్ కెప్టెన్సీ కొనసాగింపుపై బోర్డు తన వైఖరిని స్పష్టం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఖవాజా పుస్తకంలోని వివరాలు పాత వివాదాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చినా, ప్రస్తుతానికి కమిన్స్ నాయకత్వంపై క్రికెట్ ఆస్ట్రేలియా విశ్వాసం వ్యక్తం చేసింది. దీంతో ఆస్ట్రేలియా Test Teamలో కెప్టెన్సీ మార్పు ఉంటుందన్న ప్రచారానికి బోర్డు ప్రకటనతో తెరపడినట్లయింది.