పల్లె నిద్రకు వచ్చిన ఇన్‌ఛార్జికి ఘన స్వాగతం

21-11-2026 | 11:34pm

బోథ్. నవంబర్ 21 (విజయక్రాంతి): సోనాల మండలంలోని(Sonala Mandal) పార్టీ ( కే )గ్రామానికి కాంగ్రెస్ పార్టీ (Congress Party)బూత్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడ గజేందర్ పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా రాత్రికి చేరుకోవడం జరిగింది. తమ గ్రామానికి వచ్చిన నాయకులకు గ్రామస్తులు ఘనస్వాదం పలికారు. అనంతరం గ్రామంలో నెలకొన్న సమస్యలను ఆయన కు వివరించారు.

అనంతరం భోజన కార్యక్రమాలు ముగించుకొని మరోసారి గ్రామస్తులతో సమావేశమై మాట్లాడారు. గ్రామాల్లోకి వచ్చి ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రభుత్వానికి నివేదించాలన్న ఆశయంతో తాను పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. గ్రామస్తులు తెలిపిన సమస్యలను విన్న ఆయన తాను పర్యటించిన గ్రామాల్లో నెలకొన్న సమస్యలను జిల్లా అధికారులకు రాష్ట్ర నాయకత్వానికి జిల్లా ఇన్చార్జ్ మంత్రికి వివరిస్తామన్నారు.

ఆనవెంట కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి తెలంగాణ విచారణ రాష్ట్ర కన్వీనర్ తుల అరుణ్ కుమార్(Tula Arun Kumar) తో పాటు ఆత్మ చైర్మన్ జి రాజు యాదవ్ గ్రామ సర్పంచ్ వినోద్ తో పాటు మండలంలోని పలు గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ బోత్ మండల అధ్యక్షులు మెరుగబోజన్న, పజారత్నూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కళ్లెం విట్టల్, సహకార సంఘం డైరెక్టర్ లోలపు పోశెట్టి, ఆత్మ డైరెక్టర్ శ్రీధర్ ముండే, కాంగ్రెస్ పార్టీ బూత్ నియోజకవర్గ యువజన ఉపాధ్యక్షులు గుడాల అనీష్. సోనాల మండల అధికార ప్రతినిధి రామచందర్, బోత్ మండల అధికార ప్రతినిధి అచ్చితానంద రెడ్డి, పలు గ్రామాల సర్పంచులు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

మరిన్ని వార్తలు