కావేరి మహిళా సంఘం లైవ్ మీటింగ్‌ను పరిశీలించిన జిల్లా అదనపు డి.ఆర్.డి.ఓ
నాగిరెడ్డిపేట,నవంబర్ 21 (విజయక్రాంతి): మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామంలోని(Nagireddypeta Village) కావేరి మహిళా సంఘం నిర్వహిస్తున్న లైవ్ మీటింగ్‌కు జిల్లా అదనపు డిఆర్డిఓ విజయలక్ష్మి హాజరై సంఘ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బ్యాంకు లింకేజీ రుణాల చెల్లింపు విధానం, బుక్ కీపింగ్ నిర్వహణ,ఆర్థిక మరియు ఆర్థికేతర అంశాలను పరిశీలించి తగిన సూచనలు,సలహాలు అందించారు.అదేవిధంగా లోకోస్ ఈ-కేవైసీ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు.లింగంపల్లి గ్రామంలో ఇందిరా జీవిత బీమా నమోదును పరిశీలించారు.
అలాగే వెంకంపల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.లింగంపల్లి గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణం పనులు పరిశీలించి పలు సూచనలు తెలియజేశారు.వెంకంపల్లి గ్రామంలో మొండి బకాయిల వసూలు గురించి సర్పంచ్‌తో చిలుకూరు జ్యోతి సురేందర్,ఎంపీడీవో గంగాధర్ చర్చించారు.ఈ కార్యక్రమంలో ఏపిఎం దత్తు,వెంకంపల్లి,లింగంపల్లి గ్రామ సర్పంచ్‌లు చిలుకూరి జ్యోతి సురేందర్‌రెడ్డి, అనిత గోపాల్ గౌడ్,సిసిలు రాజయ్య,రవి, పెంటయ్య,మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.