శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా వనభోజనాలు

21-11-2026 | 11:30pm

ఝరాసంగం నవంబర్ 21: ఝరాసంగం మండలం(Jharasangam Mandal), కొల్లూరు గ్రామంలోని శ్రీ రామేశ్వరం దేవస్థానంలో(Sri Rameswaram Temple) వనభోజన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. కొల్లూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్ ఆధ్వర్యంలో ఈ వేడుకను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ కోర్టు న్యాయమూర్తి, మాజీ జిల్లా చైర్‌పర్సన్ సునీత హనుమంతరావు పాటిల్(Sunita Hanumantrao Patil), ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్, పెద్దలు శ్రీ రాచన్న స్వామి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

వీరితో పాటు పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు, బంధుమిత్రులు మరియు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అందరూ స్వామివారిని దర్శించుకుని, అనంతరం ఏర్పాటు చేసిన ప్రేమ విందు (వనభోజనం)లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు