అనధికార డెత్ సర్టిఫికెట్ల జారి.. ఐదుగురి అరెస్టు
- పరారీలో ఒకరు
- రాత్రి పోలీసుల వెల్లడి
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లిలో కలకలం రేపిన అనధికార డెత్ సర్టిఫికెట్ల రాకెట్(Death Certificate Racket) లో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఒకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్ శనివారం రాత్రి నిందితుల అరెస్టు వివరాలను వెల్లడించారు. ఇటీవల బెల్లంపల్లి మండలంలో అనధికార మరణ ధృవీకరణ పత్రాలు(Death Certificate Racket) జారీ చేసిన కంప్యూటర్ ఆపరేటర్(Computer Operator) అతనికి సహకరించిన బుద్ధఖుర్ద్ కారోబర్,గోదావరిఖని మున్సిపాలిటీ ఔట్ సౌర్కింగ్ ఉధ్యోగులు ఇద్దరు,గోదావరిఖని మీసేవ ఆపరేటర్ బెల్లంపల్లి మండలంలో ఇటీవల జారీ చేసినా అనధికార ధృవీకరణ పత్రాల నిందితులనీ తెలిపారు.
సంఘటనపై ఈ నెల 17న బెల్లంపల్లి MPO గుమ్ముల కృష్ణవేణి ఫిర్యాదు మేరకు ధర్యాప్తు చేపట్టారు. MPO కార్యాలయం లోని కంప్యూటర్ ఆపరేటర్ ఐన చిందం శ్రీనివాస్ పంచాయత్ సెక్రెటరీ ల డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ లు అతని ఆధీనంలో ఉన్నందున డబ్బుకు ఆశ పడి బుధ కుర్దు గ్రామంలో ఒక 16 సర్టిఫికేట్లు అనధికారికంగా ధృవీకరించారు. అందులో ఒక 11 సర్టిఫికేట్ లు బుధ కుర్దు కారో బార్ అయిన చిందం రవి సాయంతో అనధికారిక మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం జరిగింధి.
ఒక్కో సర్టిఫికేట్ కు రూ. 2000 నుండి 3000 వరకు తీసుకోవడం జరిగింది. సాదుల్లా పంచాయతీ సెక్రెటరీ సెలవులో ఉన్నప్పుడు,అతని డిజిటల్ సిగ్నేచర్ ను అతనికి తెలియకుండా ఆ సమయంలో అడిషనల్ చార్జి తీసుకున్న శ్రీనివాస్ సెక్రెటరీ లాగ్ ఇన్ లో 16 సర్టిఫికెట్లను జారీ చేశారు. అవే కాకుండా కంప్యూటర్ ఆపరేటర్ ఐన చిందం శ్రీనివాస్ పెర్కపల్లి గ్రామ పంచాయతిలో 11 సర్టిఫికేట్లు ఎటువంటి అనుమతి లేకుండా జారీ చేశారు. వాటిలో ఒకటి పెర్కపల్లి ది కాగా మిగిలిన 10 పెద్దపల్లి జిల్లావి.
వాటిని కూడా స్నిగ్ధ పంచాయతీ సేక్రటరీ డిజిటల్ సిగ్నేచర్ ను ఇప్పుడు ఉన్న సాయిరాం సెక్రెటరీ లాగ్ ఇన్ లో జారీ చేయడం జరిగింది. వీటి జారీ లో ఇంకా మంచిర్యాల మున్సిపాలిటీ కార్పొరేషన్ లో పనిచేసే సానిటరీ ఇన్స్పెక్టర్ ఐన వైకుంఠం, గోదావరిఖనికి సంబంధించిన రామగుండం మున్సిపాలిటీ లో అవుట్ సోర్సింగ్ లో పనిచేసే ఆనంద్,సాగర్ మీసేవ ఆపరేటర్ ఐన నరేందర్ హస్తం ఉందినీ తెలిపారు. వీరందరూ ప్రతి సర్టిఫికెట్ కు రూ. 10,000 నుండి రూ.15,000 తీసుకొన్నారు. మంచిర్యాల కు సంబంధించిన వైకుంఠం పరారీలో ఉన్నాడు. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.