కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
కళ్యాణ లక్ష్మి పథకంపై ప్రతిపక్షాలు విమర్శలు మానుకోవాలి
సర్పంచ్ జోగు లక్ష్మమ్మ వెంకటరమణ
జడ్చర్ల, నవంబర్ 21: జడ్చర్ల నియోజకవర్గంలోని(Jadcherla Constituency) అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా ఇద్దరు లబ్ధిదారులకు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. చర్లపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ నరసింహ స్వామి, కళావతి దంపతుల కుమార్తె యామినికి, బోయలకుంట గ్రామానికి చెందిన బొలగం శేఖర్ గౌడ్, మాధవి దంపతుల కుమార్తె ప్రసన్నకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా చర్లపల్లి గ్రామ సర్పంచ్ జోగు లక్ష్మమ్మ వెంకటరమణ మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు ఆడపిల్లల వివాహ సమయంలో ఆర్థిక భరోసా కల్పిస్తున్న కళ్యాణ లక్ష్మి పథకంపై ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలపై రాజకీయ విమర్శలు చేయడం సరికాదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా చూడాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.