హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్.. ఈ రూట్లలో వెళ్లొద్దు!
గురునానక్ జయంతి ఊరేగింపు.. సాయంత్రం నుంచి ట్రాఫిక్ డైవర్షన్స్!
హైదరాబాద్: నగరంలోని వాహనదారులకు Traffic Alert. గురునానక్ దేవ్ జీ 557వ జయంతి వేడుకల సందర్భంగా నవంబర్ 21న పాతబస్తీలో భారీ ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పలు ప్రాంతాల్లో Traffic Restrictions, Route Diversions అమలు చేయనున్నారు. ఊరేగింపు సాగే మార్గాల్లో వాహనాల రాకపోకలను నియంత్రించనుండటంతో వాహనదారులు ముందుగానే తమ ప్రయాణాలను Plan చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
అశోక్ బజార్ గురుద్వారా నుంచి ప్రారంభమయ్యే Procession అఫ్జల్‌గంజ్ టీ జంక్షన్, ఎస్ఏ బజార్, ఎంజే మార్కెట్, పుత్లీబౌలి, గౌలిగూడ చమన్, శంకర్ షేర్ హోటల్ మీదుగా తిరిగి గురుద్వారాకు చేరుకోనుంది. ఈ మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉండటంతో పోలీసులు అవసరాన్ని బట్టి వాహనాలను ఇతర రూట్లలోకి మళ్లించనున్నారు. పుత్లీబౌలి నుంచి మదీనా వైపు వెళ్లే వాహనాలను ఓల్డ్ స్టేషన్ రోడ్, ఎస్జే బ్రిడ్జి, సాలార్జంగ్ మ్యూజియం రోటరీ మీదుగా Divert చేయనున్నారు. మదీనా నుంచి ఎంజే మార్కెట్ వెళ్లేవారు డెంటల్ కాలేజ్ లేన్, ఎంజే బ్రిడ్జి, అలాస్కా మార్గాలను ఉపయోగించాలి. ప్రత్యామ్నాయంగా నయాపూల్, సాలార్జంగ్ మ్యూజియం రోడ్, దారుల్షిఫా, ఎస్జే బ్రిడ్జి, రంగమహల్, జమ్నాఘ్ మీదుగా కూడా ప్రయాణించవచ్చు.
గౌలిగూడ, ఎస్ఏ బజార్ మసీదు, అఫ్జల్‌గంజ్ టీ జంక్షన్ ప్రాంతాల్లోనూ Traffic Diversions అమలు చేయనున్నారు. సిటీ కాలేజ్, జుమ్మెరాత్ బజార్, పురానాపూల్ పరిసరాల్లో వాహనాల రాకపోకలను పరిస్థితులకు అనుగుణంగా మళ్లిస్తారు. అబిడ్స్, గాంధీభవన్ నుంచి జాంబాగ్ రోడ్, పుత్లీబౌలి ఎక్స్ రోడ్, సీబీఎస్ బస్‌స్టాండ్ పరిసరాల్లో ఊరేగింపు కదలికలను బట్టి ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. వాహనదారులు Alternative Routes ఎంచుకోవాలని, ప్రయాణానికి అదనపు సమయం కేటాయించుకోవాలని పోలీసులు సూచించారు. ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటిస్తూ రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరారు. అత్యవసర సహాయం లేదా ట్రాఫిక్ సమాచారం కోసం 9010203626 నంబర్‌ను సంప్రదించవచ్చు.