మత్స్య మహిళా సంఘం నూతన కమిటీ ఎన్నిక

21-11-2026 | 11:17pm

మహబూబ్‌నగర్: కార్పొరేషన్ పరిధిలోని చిన్నదర్పల్లిలో మత్స్య పారిశ్రామిక మహిళా సంఘం(Women's Fishery Industry Association) నూతన కమిటీని ఎన్నికల అధికారి వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా బి. విజయలక్ష్మి, ఉపాధ్యక్షురాలిగా కే. మహేశ్వరి, ప్రధాన కార్యదర్శులుగా కే. శివలక్ష్మి ఎన్నికయ్యారు. డైరెక్టర్లుగా ఎస్. శారద, జి. అనిత, ఇందిరమ్మ, కృష్ణవేణి, పుష్పలత, వి. శంకరమ్మ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేయాలని, చేపల పెంపకం, మార్కెటింగ్‌పై అవగాహన పెంచుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.

మరిన్ని వార్తలు