అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట..
నవంబర్ 25 నుంచి బాండ్ల ధృవీకరణ
కరీంనగర్ క్రైం నవంబర్ 21(విజయక్రాంతి): అగ్రిగోల్డ్ బాధితులకు(AgriGold victims) ఊరట కల్పించేలా సీఐడీ కీలక నిర్ణయం(Crucial decision by the CID) తీసుకుంది. అసలు అగ్రిగోల్డ్ బాండ్లు, నగదు రసీదుల ధృవీకరణ, నమోదు ప్రక్రియ(Verification and registration process for AgriGold bonds and cash receipts)ను నవంబర్ 25 నుంచి ప్రారంభించనుంది. ఉమ్మడి కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల బాధితుల కోసం కరీంనగర్‌లోని సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్(City Police Training Centre) (సీటీసీ)లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
నవంబర్ 25 నుంచి ఫిబ్రవరి 2, 2027 వరకు మండలాల వారీగా ధృవీకరణ చేపట్టనున్నారు. ప్రతి పని దినాన ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గరిష్టంగా 250 ఖాతాలను పరిశీలిస్తారు. బాధితులు తమ మండలానికి కేటాయించిన తేదీ ప్రకారం కేంద్రానికి హాజరుకావాలి.
ధృవీకరణ కోసం అసలు బాండ్లు, నగదు రసీదులు పరిశీలనకు తీసుకురావాలి. వాటి స్వీయ ధ్రువీకరణ చేసిన రంగు జిరాక్స్ ప్రతులు, ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్, తాజా ఫొటో, మొబైల్ నంబర్ సమర్పించాలి. డిపాజిటర్ మరణించిన సందర్భంలో నామినీ లేదా చట్టబద్ధ వారసులు మరణ ధృవీకరణ పత్రాలు, కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రాలతో హాజరుకావాలి. డిపాజిటర్ రాలేని పక్షంలో అధికారిక అనుమతి లేఖతో కుటుంబ సభ్యులు హాజరుకావచ్చు.
అసలు బాండ్లను అధికారులకు అప్పగించాల్సిన అవసరం లేదని సీఐడీ స్పష్టం చేసింది. పత్రాల పరిశీలన అనంతరం బాధితులకు రసీదు అందజేస్తారు. ఏజెంట్లు తమ ఏజెంట్ కోడ్‌తో పాటు అవసరమైన గుర్తింపు పత్రాలు సమర్పించాలి. బాధితులు తమ మండలానికి కేటాయించిన తేదీని ముందుగా నిర్ధారించుకుని అవసరమైన పత్రాలతో హాజరుకావాలని సూచించారు.