ఇందిరమ్మ బీమాతో పేదలకు ఆర్థిక భరోసా
డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం(Indiramma Family Life Insurance Scheme) పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క(DCC President Athram Sugunakka) అన్నారు. శనివారం డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి పథకం పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే రూ.5 లక్షల బీమా అందించడమే పథకం లక్ష్యమని తెలిపారు.
18 నుంచి 59 ఏళ్ల వయసు వారు ఆధార్, రేషన్ కార్డు, ఫోన్ నంబర్‌తో నమోదు చేసుకోవాలని కోరారు. అర్హులైన రేషన్ కార్డు లేని కుటుంబాలను సైతం పథకంలో చేర్చేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉబేద్ బిన్ యహియ (తారిక్), రాపర్తి మురళి, రత్నం ఆనంద్, జాడే ప్రసాద్, చిట్ల నారాయణ, సంతోష్, పెంటు, సతీష్, అబ్దుల్, మధు, సత్యనారాయణ, గణేష్, ఆనంద్ రావు, బీమ్ రావు, జానకిరామ్, రాము తదితరులు పాల్గొన్నారు.