పాక్ క్రికెటర్లకు నోటీసులు

11-09-2026 | 05:35am

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 10: పాకిస్తాన్(Pakistan) ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్, సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌కు పాక్ జా తీయ సైబర్ నేర దర్యాప్తు సంస్థ నోటీసు(Notices)లిచ్చింది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ గాయం సాకు చూపి రెండో టెస్టులో బ్యాటింగ్ చేయకుండా తప్పించుకున్నాడని.. ఫిక్సింగ్‌లో భాగంగానే ఇలా చేశాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. రిజ్వాన్ సైతం క్రమ శిక్షణను ఉల్లం ఘించాడని పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా జియో టీవీ బాంబు పేల్చింది. ఇమామ్ ఉల్ హక్, రిజ్వాన్‌లకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది.

అధికారులు వీరిద్దరిని విచారణకు రావాల్సిందిగా ఆదేశించినట్లు పేర్కొంది. జాతీయ సైబర్ నేర దర్యాప్తు సంస్థ పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ పరిధిలో ఉంటుంది. ఈ శాఖకు మోసిన్ నక్వీ మంత్రిగా వ్యవహరిస్తున్నాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కూడా నక్వీనే చైర్మన్. ఈ నేపథ్యంలో ఇమామ్ ఉల్ హక్, రిజ్వాన్‌లకు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. వీరిద్దరితో పాటు మరో పాక్ క్రికెటర్‌ను కూడా అధికారులు విచారించనున్నట్లు సమాచారం. లార్డ్స్‌లో ఇంగ్లం డ్‌తో రెండో టెస్టు తర్వాత పాక్ బోర్డు ఇమా మ్, రిజ్వాన్‌ల ఫోన్లను స్వాధీనం చేసుకుంది.

మరిన్ని వార్తలు