కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా నీరజ నియామకం.
11-09-2026 | 06:11pm
బోథ్,(విజయక్రాంతి) మండల కాంగ్రెస్ పార్టీ(Congress party) కార్యదర్శిగా పిప్పల్దరి గ్రామానికి చెందిన నీరజనునియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పిప్పల్ దరి గ్రామ(Pippal Dari Village) సర్పంచ్గా పోటీ చేసి ఈమె ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్న ఈమెను గుర్తించి అధిష్టానం బాధ్యతలు కట్టబెట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తనపై నమ్మకంతో బాధ్యతలు కట్టబెట్టిన జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేరుస్తామన్నారు.