గ్లోబల్ ఎకానమీలో బ్రిక్స్ దూకుడు: పుతిన్
11-09-2026 | 06:18pm
ఢిల్లీ: ప్రపంచంలో బ్రిక్స్ కూటమి ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోందని రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin) అన్నారు. బ్రిక్స్ దేశాల నుంచి అనేక విజయగాథలు వెలుగులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. పశ్చిమ దేశాలతో బ్రిక్స్ దేశాలు పోటీపడుతున్నాయని తెలిపారు.బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ..ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగానికిపైగా బ్రిక్స్ దేశాల వాటానే ఉందన్నారు. బ్రిక్స్ కూటమి ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తోందని పేర్కొన్నారు. సభ్య దేశాల్లో వేగంగా జరుగుతున్న పట్టణీకరణ ఆర్థిక అభివృద్ధికి మరింత ఊతమిస్తోందని పుతిన్ వెల్లడించారు.