ఈ బౌలింగ్‌తో కష్టమే

19-10-2026 | 05:25am

భారత క్రికెట్ జట్టు బౌలింగ్ బలహీనంగా మారిపోయిందా ? స్టార్ పేసర్ బుమ్రా(Star pacer Bumrah) లేకుంటే మన బౌలింగ్ పరిస్థితి అంతేనా ? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. బుమ్రాకు రీప్లేస్‌మెంట్ లేకపోవడం, సెలక్టర్లు ప్లాన్ బిపై ఫోకస్ పెట్టకపోవడం, జట్టు ఎంపికలో అనవసర ప్రయోగాలు వెరసి మన బౌలింగ్‌ను పేలవంగా మార్చేసాయి. విండీస్‌తో సిరీస్‌లో భారత బౌలింగ్‌కు పాస్ మార్కులు కూడా వేయలేమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వన్డే ప్రపంచకప్‌కు ఇక ఏడాది మాత్రమే మిగిలి ఉన్న వేళ ఈ బౌలింగ్‌తో మెగాటోర్నీలో భారత్ సత్తా చాటగలదా ?

  1. బలహీనంగా భారత పేస్ ఎటాక్
  2. తేలిపోతున్న యువ పేసర్లు
  3. అనవసర ప్రయోగాలతో ఇబ్బందులు
  4. ప్లాన్ బి పై ఫోకస్ పెట్టని సెలక్టర్లు

ముంబై, అక్టోబర్ 18 : క్రికెట్‌లో బ్యాటింగ్ ఒక్కటే కాదు బౌలింగ్, ఫీల్డింగ్ మూడింటిలోనూ సమిష్టిగా రాణిస్తేనే విజయాలు దక్కుతాయి. టీ20ల్లో బ్యాటర్లు 250 ప్లస్ స్కోరు చేసినా బౌలర్లు తేలిపోతే గెలుపు అం దని ద్రాక్షే. తాజాగా వెస్టిండీస్‌తో సిరీస్(Series against West Indies) ద్వా రా ఇది మరోసారి రుజువైంది. విండీస్‌పై వన్డే సిరీస్‌లోనూ(ODI series), టీ20 సిరీస్‌లోనూ మన బౌలింగ్ అట్టర్ ఫ్లాప్ అయింది. బ్యాటర్ల ప్ర తిభతో విజయాలు దక్కినా బౌలింగ్ లోపా లు మాత్రం స్పష్టంగా బయటపడ్డాయి.

నిజానికి జహీర్‌ఖాన్, షమీ, భువనేశ్వర్ కుమార్ వంటి సీనియర్ పేసర్ల తర్వాత వారి స్థానాలను భర్తీ చేయడంలో బీసీసీఐ కొంత మాత్రమే సక్సెస్ అయింది. ఈ క్రమంలో బుమ్రా ఒక్కడే నిలకడగా రాణించగా, మిగిలిన బౌలర్లందరూ గాయాలు, ఫిట్‌నెస్ స మస్యలు, ఫామ్ లేమితో జట్టులోకి వస్తూ పోతూ ఉంటున్నారు. ఫలితంగా విజయాల కోసం బ్యాటర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం ముగిసిన విండీస్ సిరీస్‌లో మన బౌలింగ్ బలహీనతలు మరోసారి తేటతెల్లమయ్యాయి.

ఈ పరిస్థితికి కారణాలు చాలా నే ఉన్నాయి. ముఖ్యంగా బుమ్రాపై ఎక్కువగా ఆధారపడడం కొంపముంచింది. ఫలి తంగా అతనికి విశ్రాంతి లేకుండా మ్యాచ్‌లు ఆడించి, ఇప్పుడు రొటేషన్ పేరుతో ఒక్కసారిగా తప్పించేసరికి మన బౌలింగ్ సాదా సీదాగా మారిపోయింది. బుమ్రా స్థానాన్ని భర్తీ చేసే సరైన పేసర్‌ను బీసీసీఐ సెలక్టర్లు, టీమిండియా మేనేజ్‌మెంట్ ఇప్పటి వరకూ గుర్తించలేకపోయింది. కొందరు బౌలర్లు కొన్ని ఫార్మాట్లకే పరిమితం చేయడం కూడా ప్రభావం చూపుతోంది.

అదే సమయంలో కీలక బౌలర్లను గాయాలు, ఫిట్‌నెస్ సమస్య లు వెంటాడుతున్నాయి. ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చే మరో ప్రపంచ స్థాయి బౌలర్ అందుబాటులో లేకపోవడం పెద్ద లోపంగా మారింది. మరోవైపు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో బ్యాటింగ్ డెప్త్ పెంచే లక్ష్యంతో ఆల్ రౌండర్లపైనే ఎక్కువ దృష్టి పెట్టడం కూడా మరో కారణంగా చెప్పొచ్చు. దీంతో స్పెషలిస్ట్ బౌలర్లకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఆల్‌రౌండర్లు ఏమాత్రం ప్రభావం చూపలేక చతికిలపడుతున్నారు.

బౌలింగ్ కాంబినేషన్లను తరచుగా మారుస్తుండడం కూడా జట్టుకు ఇబ్బందులు తెస్తోంది. ఐపీఎల్‌లో రాణించిన యువ బౌలర్లకు అంత ర్జాతీయ స్థాయిలో సరైన అనుభవం లేక పరుగులు కట్టడి చేయలేకపోతున్నారు. అ న్నింటికీ మించి పిచ్‌లు కూడా భారత బౌలింగ్ బలహీనతకు కారణమవుతున్నా యి. ఎంతసేపూ ఫ్లాట్ పిచ్‌లనే తయారు చేస్తూ బౌలర్ల ఆత్మవిశ్వాసం దెబ్బతీనడానికి బీసీసీఐ కారణమవుతోందని పలువురు మాజీలు విమర్శిస్తున్నారు. స్వదేశీ పిచ్‌లకు, విదేశీ పిచ్‌లకు మధ్య తేడాను గమనించి బౌలింగ్‌ను మార్చుకోవడంలోనూ మన బౌలర్లు విఫలమవుతున్నారు.

లైన్ అండ్ లెంగ్త్ మార్చకపోవడం, స్లోయర్ బాల్స్ లేదా యాంగిల్స్ ఉపయోగించకపోవడం , మైదానాన్ని ఫీల్డింగ్ కోసం సరిగ్గా సర్దుబాటు చేయకపోవడం వంటి లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉపఖండం పిచ్ల్‌పై రాణించినట్లుగా, స్వింగ్, సీమ్ ,బౌన్స్ ఉండే విదేశీ పిచ్‌లపై భారత బౌలర్లు పూర్తి స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నారు. మైదానాల పరిమాణాన్ని బట్టి బౌలింగ్ వ్యూహాలు మార్చకపోవడం కూడా వైఫల్యానికి కారణమవుతోంది. ఇప్పుడు న్యూజి లాండ్ టూర్‌లో టీ20 సిరీస్ వరకూ భువనేశ్వర్ లాంటి సీనియర్ పేసర్ జట్టులో ఉన్నప్పటకీ మిగిలిన బౌలర్లు ఎలా రాణిస్తారనేది చూడాలి.

మరిన్ని వార్తలు