అలెన్, సిఫర్ట్, ఫెర్గ్యుసన్‌లకు పిలుపు
భారత్‌తో వన్డేలకు న్యూజిలాండ్ జట్టు ప్రకటన
వెల్లింగ్టన్, అక్టోబర్ 11 : సొంతగడ్డపై భారత్‌తో జరిగే ఐదు వన్డేల సిరీస్(ODI Series) కోసం న్యూజిలాండ్ క్రికెట్ జట్టును ప్రకటించారు. 2027 ప్రపంచకప్ సన్నాహకంగా ఈ సిరీస్ ఉండడంతో పటిష్టమైన జట్టును ఎంపిక చేశారు. పలువురు కీలక ఆటగాళ్లకు చాలా రోజుల తర్వాత పిలుపునిచ్చారు. అదే సమయంలో రెండు టెస్టుల సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని మొదటి 3 వన్డేలకు ఒక జట్టును, తర్వాతి 2 వన్డేలకు మరో జట్టును వ్యూహాత్మకంగా ఎంపిక చేశారు. ఫిన్ అలెన్, సిఫర్ట్, ఫెర్గ్యుసన్ చాలా కాలం తర్వాత జట్టులోకి తిరిగొచ్చారు.
అలాగే భుజం గాయం కారణంగా భారత్‌తో టీ20 సిరీస్ నుంచి తప్పు కున్న ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర ఫిట్‌నెస్ సాధించడంతో అతన్ని వన్డే జట్టులోకి ఎం పిక చేశారు. రచిన్ రవీంద్ర మొదటి మూడు వన్డేల్లో ఆడనున్నాడు.
మిచెల్ సాంట్నర్ ఈ ఐదు మ్యాచ్‌లకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. నవంబర్ 4 నుంచి ప్రారంభమయ్యే తొలి మూడు వన్డేలకు 14 మంది సభ్యుల జట్టును ప్రకటించారు. టెస్ట్ సిరీస్ నవంబర్ 19న వెల్లింగ్టన్‌ల్లో ప్రారంభం కానున్నందున కొందరు కీలక టెస్ట్ ఆటగాళ్లకు వన్డే సిరీస్ మధ్యలోనే విశ్రాంతినిచ్చి టెస్ట్ సన్నాహాలకు పంపనున్నారు.