కేసీఆర్ దూరదృష్టితోనే కొత్త జిల్లాల ఏర్పాటు

12-10-2026 | 05:30am
  1. రాజన్న సిరిసిల్ల అభివృద్ధికి కేటీఆర్ కృషి కీలకం
  2. దశాబ్ది ఉత్సవాల్లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్

సిరిసిల్ల, అక్టోబర్ 11 (విజయక్రాంతి): పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే దూరదృష్టితోనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పా టు చేశారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్(Former MP Boinapally Vinod Kumar) అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆ విర్భావ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ఆయ న, జిల్లా ఏర్పాటు వెనుక ప్రజల చిరకాల ఆకాంక్షలు, ప్రజాప్రతినిధుల కృషి ఉన్నాయని పేర్కొన్నారు.

గతంలో సిరిసిల్ల ప్రాంత ప్రజలు ప్రభుత్వ పనుల కోసం కరీంనగర్కు వెళ్లాల్సి వచ్చేదని, ఆ ఇబ్బందులను తొలగించి స్థానికంగానే పాలన అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో జిల్లా ఏర్పాటు జరిగిందన్నారు. నాటి మంత్రి కేటీఆర్ జిల్లా ఏర్పాటులో కీలక పాత్ర పోషించడంతో పాటు అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు.

జిల్లాలో మెడికల్, నర్సింగ్, వ్యవసా య కళాశాలలు, వ్యవసాయ పాలిటెక్నిక్, నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, గ్రం థాలయం వంటి సంస్థల ఏర్పాటుతో పాటు సిరిసిల్ల అపెరల్ పార్క్, ఆక్వా పరిశ్రమ, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు వివరించారు.

వేములవాడ నాటి ఎ మ్మెల్యే చెన్నమనేని రమేష్బాబు సైతం ఈ ప్రాంతాన్ని రాజన్న జిల్లాగా ఏర్పాటు చేయడానికి విశేషంగా కృషి చేశారని గుర్తుచే శారు.గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలిజిల్లా అభివృద్ధి కేవలం కేంద్రానికే పరి మితం కాకుండా మారుమూల గ్రామాలకూ చేరాలని వినోద్కుమార్ సూచించారు.

గ్రా మీణ ప్రాంతాల్లో రహదారులు, నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, తాగునీరు, సాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పిం చాలని అన్నారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, అన్ని సామాజిక వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యమివ్వాలని కోరారు.ప్రభుత్వాలు మారినా ప్రజలకు ఉపయోగపడే విద్యా, వైద్య సంస్థలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కొనసాగాలని పేర్కొన్నారు.

జిల్లా ఏర్పాటుకు కృషి చేసిన ప్రజాప్రతినిధులు, ఉద్యమకారుల సేవలను స్మరించుకుంటూ.. భవిష్యత్తులో రాజన్న సిరిసిల్లను మరింత అ భివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని వర్గాల ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీ ఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మా జీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, చల్మెడ ల క్ష్మీనరసింహారావు, మాజీ కార్పొరేషన్ చైర్మ న్ ప్రవీణ్, మున్సిపల్ చైర్మన్ చక్రపాణి, సెస్ చైర్మన్ రామారావు, మాజీ జడ్పీ చైర్పర్సన్లు ఉమ, అరుణ రాఘవరెడ్డి, మనోహర్రెడ్డి, వేణు, సెస్ డైరెక్టర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు