కేంద్ర నిధులతో రాష్ట్ర విశేష లబ్ధి

12-10-2026 | 05:20am
  1. రూ.13 లక్షల కోట్లు సమకూర్చింది
  2. సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంపై ప్రశంసలు
  3. ప్రజాప్రతినిధులు సమావేశంలో బీజేపీ నేతలు

హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ సమగ్ర అభివృద్ధి(Comprehensive Development by the Central Government), సంక్షేమ కార్యక్రమాల ద్వారా తెలంగాణ రాష్ట్రం(Telangana State) విశేష లబ్ధి పొందిందని, రాష్ట్రంలోని పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.13 లక్షల కోట్లకు పైగా నిధులు సమకూర్చిందని నేతలు స్పష్టం చేశారు.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ముఖ్య సమావేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగింది. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వ అధినేతగా (ముఖ్యమంత్రిగా, అనంతరం ప్రధానమంత్రిగా) ప్రధానినరేంద్ర మోదీ విజయవంతంగా 25 సంవత్సరాల ప్రజా పరిపాలనను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ వేదిక ద్వారా ప్రజాప్రతినిధులు ప్రధానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

సేవా భావం, రాష్ట్ర సేవా నిబద్ధతను చాటిచెబుతూ ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా తెలంగాణవ్యాప్తంగా బీజేపీ నిర్వహించిన విస్తృత సేవా కార్యక్రమాలను ఈ సమావేశం ఘనంగా ప్రశంసించింది. నరేంద్ర మోదీ అనుసరిస్తున్న ’నాగరిక్ దేవో భవ’ అనే మార్గదర్శక సూత్రాన్ని ఈ సమావేశంలో నేతలు ప్రత్యేకంగా కొనియాడారు.

ఈ సమావేశంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్, ఎంపీ, తమిళనాడు రాష్ట్ర కో-ఇంచార్జ్ డి.కె. అరుణ, మల్కాజ్‌గిరి ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి,

ధర్మపురి అరవింద్, బీజేపీ శాసనసభాపక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ శాసనమండలి పక్ష నాయకులు ఏవీఎన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర కో-ఇంచార్జ్ అభయ్ పాటిల్, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు