ఎస్‌ఐఆర్‌పై ప్రతిపక్షాల దుష్ప్రచారం
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాదగిరి సునీల్ రావు
ముకరంపుర, అక్టోబర్ 11 (విజయక్రాంతి): ప్రతిపక్షాలు ఎస్‌ఐఆర్ పై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను గందరగోళం లోకి నెట్టి వేస్తున్నారని బీజేపి రాష్ట అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు(Representative Deputy Mayor Yadagiri Sunil Rao) అన్నారు. కరీంనగర్ లో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియలో 82 కోట్ల మంది ఓటర్లు కొత్తగా వచ్చిన ఓటర్ల జాబితాలో నమోదు కావడం జరిగిందన్నారు.
ఇందులో 88 శాతం పాత ఓటర్ల జాబితాలో ఉన్నవారే కొత్త ఓటర్ల జాబితాలోకి రావడం జరిగిందని తెలిపారు. 13 కోట్ల మంది ఓటర్లు వివిధ దశల్లో విచారణలో ఉన్నారని,2 కోట్ల 89 లక్షల మంది ఓటర్లు మరణించి ఉన్నారు కాబట్టి ఇందులో వీరు ఉండే అవకాశం లేదన్నారు. దాదాపు 1 కోటి 1 లక్ష మంది ఫేక్ ఓటర్లు ఒక్కొక్కరు రెండు నుండి మూడు చోట్ల ఉన్నారని తెలిపారు.
ఇలాంటి ఓటర్లు ఇప్పటి వరకు వివిధ దశల్లో విచారణకు హాజరు కాకపోవడం, బిఎల్‌ఓ లకు సరైన ద్రువ పత్రాలు ఇవ్వక పోవడం వల్ల అలాంటి ఓటర్లను షిప్టెడ్, ఆబ్సెంట్, డెత్ కెటగిరి జాబితాలో రావడం జరిగిందని తెలిపారు.ఇంత జాగ్రత్తగా ప్రక్రియ జరిగినా చాలా ఓటర్లు హాజరు కాక, వేరే ప్రాంతాలకు వెల్తే వీరి ఓట్లు ఎక్కడ ఉన్నాయని పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.
ఫాం 6 ప్రక్రియ నిరంతరంగా కొనసాగే ప్రక్రియ అని తెలిపారు. ప్రతి సంవత్సరం 4 సార్లు ఓటర్ దరఖాస్తు చేస్తే బిఎల్‌ఓలు , రెవెన్యూ అధికారులు విచారణ జరిపి ఏఆర్ ఓ సమక్షంలో ఓటర్ జాబితాలో పొందుపరచడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఫారం 7 ద్వారా ఓటర్లను తొలగించారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి అది అవాస్తవం అన్నారు.
ఫాం 7 అనేది ఓటర్ జాబితాలో ఉన్న వ్యక్తులను ఎవరైన వ్యతిరేకిస్తే సంబంధిత ఓటర్ ను పరిశీలన చేసిన తర్వాత నిర్ణయం జరుగుతుందని చెప్పారు. ఓట్లు తొలగించే అధికారం రాజకీయ పార్టీలకు లేదని తేల్చిచెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అలాంటి ఓట్లు తొలగించే ప్రయత్నం చేసిందో తెలియదని అనుమానం వ్యక్తం చేశారు.
2014 ఎన్నికల నుండి మోడి గెలుస్తూ వస్తున్నారు. ఓట్లు చోరీ చేసి గెలవాలి అనుకుంటే 303 వచ్చిన సీట్లు బిజేపి కి 240 సీట్ల గ్రాఫ్ ఎలా పడిపోయిందని ప్రశ్నించారు. ఇవన్ని ప్రతి పక్షాలు చేస్తున్న కట్టు కథలని ద్వజమెత్తారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలన్నదే ఎస్‌ఐఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు.
దొంగ ఓట్లతో చాలా ఇబ్బందులు ఉండేవని ఎస్‌ఐఆర్ మాకు హెల్ప్ చేసిందని నేటి కేరళ హోం మంత్రి లాంటి వ్యక్తులు చెబుతా ఉంటే ఇక్కడ మాత్రం సిగ్గు లేకుండ దర్నాలు రాస్తా రోకో లు చేయడం ఎంత వరకు సమంజసం అని నిలదీశారు. స్వచ్చమైన ఓటర్ జాబితా తయారు చేయడమే ఎస్‌ఐఆర్ ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు.
జ్ఞానేష్ కుమార్ బీజేపికి వంతపాడారని ఆరోపిస్తున్నారు 2025 లో జ్ఞానేష్ కుమార్ ఎన్నికల కమీషనర్ గా వచ్చారని అంతకు ముందే ఎన్నికలు జరిగాయని స్పష్టం చేశారు. ఎన్నికల కమీషన్ వ్యవస్థను దుర్వినియోగం చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ద్వజమెత్తారు. ఆనాడు ఎలక్షన్ కమీషనర్లకు పదవులు ఇచ్చి రాజకీయంగా వాడుకున్నది కాంగ్రెస్ పార్టీ అని నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులకు మాది ఒకటే ప్రశ్న మీ దగ్గర మా ఓటు తొలగించారని ఎవరైనా వచ్చి దరఖాస్తు ఇస్తే దాన్ని బహిరంగ పరచాలని సవాల్ విసిరారు.పరిశుద్దమైన జాబితా వల్లే ఎన్నికల శాతం పెరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు తోట అనిల్, మాసం గణేష్, కొంపెల్లి రామన్, సోమిడి వేణు ప్రసాద్, పొన్నం మొండయ్య గౌడ్, కర్రే అనిల్, కోఆప్షన్ సభ్యులు సర్దార్ బల్బీర్ సింగ్, నాయకులు పండుగ నాగరాజు, వెంకట్ రెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.