గవర్నర్ కోటా కోసం ఆశలు
సిరిసిల్ల గడ్డపై సీఎం ప్రకటనతో పెరిగిన ఆశావహులు
కరీంనగర్ /సిరిసిల్ల, అక్టోబరు 11 (విజ యక్రాంతి): ముగ్గురు గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీల(Governor-nominated MLC) గడువు నవంబరు రెండవ వా రంలో ముగియనుండటంతో ఆ స్థానాల కో సం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నే తలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ మూడు స్థానాల్లో ఎవరిని నియమించాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) నిర్ణయమే ఫైనల్.
అయితే సిఎం ఇటీవల సిరిసిల్ల సభ లో బిసికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ప్రకటించడంతో కొండాలక్ష్మన్ బాపూజీ వారాసు ల్లో, స్థానిక నేతల్లో ఆశలు చిగురించాయి. వీరితో పాటు ఉమ్మడి జిల్లా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఖాళీ కానున్న మూడు స్థానాల్లో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని రెండు స్థానాలు వారికే కేటాయి ంచే అవకాశాలు ఉండటంతో ఆ సామాజిక వర్గం నుండి ఆశిస్తున్న వారి సంఖ్య పెరిగిం ది. మూడింటిలో ఉమ్మడి జిల్లా నుండి ఒకరికి ఖాయం అంటున్నారు.
ఈ క్రమంలో ఎ వరికి వారుగా లెక్కలేసుకుంటున్నారు. జిల్లా కు చెందిన మానకొండూరు మాజీ శాసనసభ్యుడు, మాజీ విప్ ఆరెపల్లి మోహన్ ఎస్సీ కోటాలో జిల్లాకు చెందిన మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఆశీస్సులతో ఆయన ఈ ప్రయత్నాలకు శ్రీకారం చుట్టి సీఎం రేవంత్ రెడ్డి వద్దకు తన ప్రతిపాదన ఉంచారు.
బీసీ కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని జిల్లాకు చెందిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఆయన జిల్లా మంత్రులు, శాసనసభ్యులు, నేతల మద్దతుతో ఈ పదవి ఆశిస్తున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి రామగుండంకు చెందిన హర్కార్ వేణుగోపాల్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నారు.
ఈయన ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ పౌరసంబంధాల విభాగానికి సలహాదారుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రొటోకాల్ ఇన్చార్జిగా సుదీర్ఘ అనుభవం ఉన్న హర్కార్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉండడంతో బ్రాహ్మణ సామాజికవర్గానికి అవకాశం కల్పిస్తే వేణుగోపాల్ ముందు వరసలో ఉంటారని చెబుతున్నారు.
సిరిసిల్ల జిల్లాలో ఎమ్మెల్సీ పదవిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవల సిరిసిల్లలో జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి పద్మశాలీలకే దక్కుతుందని ప్రకటించడంతో ఆశావహుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. దీంతో తమకు అనుకూలంగా అధిష్టానం వద్ద లాబీయింగ్ చేసేందుకు పలువురు నాయకులు ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేస్తున్నారు.
ఎమ్మెల్సీ టికెట్ కోసం పోటీ పడుతున్న ఆశావహుల్లో కొండ లక్ష్మణ్ బాపూజీ వారసులు, సిరిసిల్ల పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు గోలి వెంకటరమణ, సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కాముని వనిత రాజన్న, హైకోర్టు న్యాయవాది గుడ్ల జ్యోతి కిరణ్ లు ఉన్నారు.
పద్మశాలి సామాజిక వర్గంలో చారిత్రకంగా, సామాజికంగా గుర్తింపు పొందిన కుటుంబాల వారసులు కూడా ఈ రేసులో ఉంటే వారికి అవకాశం దక్కుతుందా అన్న చర్చ సాగుతోంది. సామాజిక సేవ, ప్రజా ఉద్యమాలు, పద్మశాలి సంఘాల అభివృద్ధి కోసం పనిచేసిన నేపథ్యం కూడా అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటుందా అనేది వేచి చూడాల్సిందే.