అంతర్జాతీయ పతకాలతో మెరవాలి
- అశ్వారావుపేట మినీ స్టేడియాన్ని మణిహారంగా తీర్చిదిద్దుతాం
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
- అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి బాలికల కబడ్డీ పోటీలు ప్రారంభం
అశ్వరావుపేట, అక్టోబర్ 11 (విజయక్రాంతి): తెలంగాణ క్రీడాకారులు(Telangana athletes) జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి పతకాలు సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) అన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని క్రీడాకారులకు సూచించారు.
ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో రాహుల్‌తో కలిసి అశ్వారావుపేట పట్టణంలో మినీ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-20 బాలికల కబడ్డీ పోటీలను మంత్రి ప్రారంభించారు. అలాగే రహదారుల అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఈ సంద ర్భంగా రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారిణులు, మహిళలు బతుకమ్మలతో అశ్వారావు పేట ప్రధాన కూడలి నుంచి క్రీడా ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. క్రీడా ప్రాంగణానికి చేరుకున్న అనంతరం మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్క రించి, రిబ్బన్ కట్ చేసి కబడ్డీ పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాటా డుతూ.. అశ్వారావుపేట వంటి గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభు త్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఐదు ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిర్మించిన అశ్వారావుపేట మినీ స్టేడియాన్ని భవిష్యత్తులో పట్టణానికి మణిహారంగా తీర్చి దిద్దుతామని తెలిపారు.
రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి బాలికల కబడ్డీ జట్లు ఈ పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉన్నదన్నారు. చిన్న మున్సిపాలిటీ అయినప్పటికీ క్రీడాకారిణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి, ఇతర సదుపాయాలు కల్పించిన నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సహకరించిన దాతలను అభినందించారు.
వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేసిన అనుభవంతో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణను అభినందించారు. తెలంగాణ రాష్ట్రం క్రీడారంగంలో జాతీ య,
అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు సా ధించేలా ప్రభుత్వం క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ, అవసరమైన సదుపాయాలు, ప్రోత్సాహం అందిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విద్యా చందన, మున్సిపల్ కమిషనర్ దిలీప్‌రెడ్డి పాల్గొన్నారు.