ఏపీఎల్‌లో చేరో ఆర్చర్స్ జోరు

12-10-2026 | 05:10am

ముషీరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): ఆర్చరీ ప్రీమియర్ లీగ్(ఏపీఎల్)(Archery Premier League) రెండో సీజన్లో చేరో ఆర్చర్స్ 6- కాకతీయ నైట్స్‌ను ఓడించింది. పీపుల్స్ ప్లాజా లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ అతాను దాస్, డెన్మార్క్కు చెందిన వరల్ నంబర్ వన్ కాంపౌండ్ ఆర్చర్ మథియాస్ ఫుల్లర్టన్, కేసీ కాఫ్హోల్ కీలకంగా రాణించారు.

ఆరు బాణాలతో 59 పాయింట్లు సాధించిన ఫుల్లర్టన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాకతీయ నైట్స్ తరఫున ఆస్ట్రియా కాంపౌండ్ స్టార్ నికో వీనర్ స్థానంలో బరిలోకి దిగిన శివశంకర్ ల్యాండ్కర్, వెన్నం జ్యోతి సురేఖ ఆకట్టుకున్నా జట్టును గెలిపించలేక పోయా రు. 

తొలి సెట్లో 70కి 69 పాయింట్లు సా ధించిన చేరో, రెండో సెట్లో అతాను దాస్ పర్ఫెక్ట్ ఎక్స్ రింగ్ పాయింట్‌తో 4- ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో సెట్లో అతాను దాస్, కేసీ కాఫ్హోల్ ఒత్తిడిలోనూ 10 పాయింట్ల బాణాలు సంధించి విజయాన్ని ఖాయం చేశారు. నాలుగు మ్యాచ్‌లలో మూడు విజయాలతో చేరో ఆర్చర్స్ ముందంజలో ఉంది.


మరిన్ని వార్తలు