దేదీప్యమానంగా శైవ క్షేత్రాలు

24-11-2026 | 11:31pm

సిద్దిపేట, నవంబర్ 24: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లాలోని పలు ఆలయాలు దేదీప్యమానంగా వెలుగొందాయి. మహిళలు సంప్రదాయబద్దంగా ఆలయాల్లో దీపాలు వెలిగించారు. సిద్దిపేట(Siddipet) పట్టణంలోని భోగేశ్వరాలయం, ఎల్లమ్మ గుడి, మార్కండేయ స్వామి తదితర ఆలయాల్లో ప్రత్యేక దీపాలంకరణ ఆకట్టుకుంది.  మహిళలు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  శైవ క్షేత్రాలు ఉదయం నుంచే భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయాల్లో నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వార్తలు