యువతి అదృశ్యం
24-11-2026 | 11:12pm
అశ్వారావుపేట, నవంబర్ 24, (విజయక్రాంతి): అశ్వారావుపేట(Aswaraopeta) పట్టణంలోని కోనేరు బజారుకు చెందిన ఉడా భాను హాసిని అనే యువతి అదృశ్యం అయినట్టు ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 21 తేదీన పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో అన్నదానానికి వెళ్లి వస్తా అని ఇంటిలో చెప్పి వెళ్ళినట్టు తండ్రి దుర్గ ప్రసాద్ తెలిపినట్టు ఎస్ఐ తెలిపారు. తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.