అచ్చంపేట సీఎం సభకు తరలిరావాలి

24-11-2026 | 11:16pm

వెల్దండ మండల కాంగ్రెస్ నాయకుల పిలుపు

వెల్దండ, నవంబర్ 24: అచ్చంపేటలో నవంబర్ 26న నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బహిరంగ సభను విజయవంతం చేయాలని, వెల్దండ సింగిల్ విండో చైర్మన్ ఎన్నం భూపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పిలుపునిచ్చారు.

మంగళవారం వెల్దండ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు హరి కిషన్ నాయక్, సింగిల్ విండో వైస్ చైర్మన్ బానోత్ శంకర్ నాయక్ తో కలిసి మాట్లాడుతూ.. అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ, మద్దిమడుగులో లంబాడీల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆదేశాల మేరకు ఈ సభకు వెల్దండ మండలం నుంచి పెద్ద సంఖ్యలో తరలివెళ్లాలని కోరారు. మహిళా సంఘం నుండి 1600 మంది మహిళలను 32 బస్సులలో, 20 బస్సుల లో పురుషు ల ను తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రతి గ్రామం నుంచి మహిళా సంఘాలకు ఒక బస్సు, పురుషులకు మరో బస్సు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ శ్రేణులు సమన్వయంతో పనిచేసి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పుల్లయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హమీద్, వెల్దండ మండల ఎల్‌హెచ్‌పీఎస్ అధ్యక్షుడు నర్సింగ్ నాయక్, వైస్ ప్రెసిడెంట్ రఘుపతి నాయక్, నరేష్ నాయక్, ఈదులపల్లి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు