మెగా హెల్త్ క్యాంపుపై సీఐ అవగాహన..

24-11-2026 | 10:36pm

వెంకటాపురం సీఐ శ్రీధర్..

పోలీసు వారి ఆధ్యర్యంలో మెగా హెల్త్ క్యాంప్..

వెంకటాపురం, నూగూరు, నవంబర్ 24 (విజయక్రాంతి): వెంకటాపురం మండలం పరిధిలో రామచంద్రపురం గ్రామంలోని జార కాలనీని వెంకటాపురం సీఐ శ్రీధర్(CI Sridhar) సందర్శించారు. ఈ సందర్భంగా ఈ నెల 28న గోవిందరావుపేటలో నిర్వహించనున్న మెగా హెల్త్ క్యాంప్ గురించి కాలనీ ప్రజలకు వివరించి అవగాహన కల్పించారు.

కాలనీలోని ప్రజలతో మాట్లాడి ఆరోగ్య సమస్యలు, వైద్య సేవల అవసరాలపై వివరాలు తెలుసుకున్నారు. మెగా హెల్త్ క్యాంప్ అందించే వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు శిబిరానికి హాజరై వైద్య పరీక్షలు చేయంచుకోవాలని సూచించారు. ఈ నెల 28న గోవిందరావుపేటలో నిర్వహించనున్న మెగా హెల్త్ క్యాంప్. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సీఐ శ్రీధర్ పిలుపునిచ్చారు.

ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు, ప్రభుత్వ ఆధ్వర్యంలో అందుబాటులోకి వచ్చే వైద్య సేవలను.ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని. అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేయడం జరిగింది. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నిర్వహించే మెగా హెల్త్ క్యాంప్కు కాలనీ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై వైద్య సేవలు పొందాలని సీఐ శ్రీధర్ కోరడం జరిగింది. ఈ కార్యక్రమాంలో ఎస్ఐ తిరుపతిరావు సిబ్బంది పాల్గోన్నారు.

మరిన్ని వార్తలు