అభివృద్ధి పార్టీ పటిష్టతపై టీపీసీసీ అధ్యక్షుని సమక్షంలో చర్చ..
పాల్గొన్న ఆదిలాబాద్ ఆది నాయకత్వం..
బోథ్ నవంబర్ 23 (విజయక్రాంతి): ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై మంగళవారం హైదరాబాదులోని గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జాదవ్ నరేష్ సమక్షంలో ఆదిలాబాద్ జిల్లా నాయకులు కలిసి పార్టీ పరిస్థితిపై చర్చించినట్లు సమాచారం. అంతేగాక పార్టీ పటిష్టత కోసం తీసుకోవాల్సిన చర్యలను టీపీసీసీ అధ్యక్షుడు జిల్లా నాయకత్వానికి సూచించినట్లు తెలిసింది.
మరోవైపు త్వరలో భర్తీ చేయనున్న వివిధ నామినేటెడ్ పదవులపై చర్చ జరిగిందని సమాచారం. జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకే మేరకు చేరుతున్నాయి అనే విషయాన్ని జిల్లా నాయకత్వాన్ని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు అగనంగా మరికొన్ని ఇందిరమ్మ ఇవ్వాల్సిందిగా జిల్లా అధ్యక్షులు అడిగారు. ప్రజల్లోకి ప్రభుత్వ సంక్షేమ పథకాలను తీసుకువెళ్లి రానున్న రోజుల్లో పార్టీని మరింత పటిష్టం చేయాలని సూచించినట్లు తెలిసింది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వం ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధితోపాటు పార్టీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అవగతం అవుతున్నది.