భార్య వదిలివెళ్లిందని మనస్తాపంతో ఆత్మహత్య
సిద్దిపేట క్రైం, నవంబర్ 24: భార్య, పిల్లలు దూరంగా ఉండటంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య(Suicide)కు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కుంచం అశోక్ (32) కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. గత రెండేళ్లుగా భార్యతో కుటుంబ కలహాలు కొనసాగుతుండటంతో ఆమె పిల్లలను వదిలి వేరే వ్యక్తితో ఉంటోంది.
దాంతో మనస్తాపానికి గురైన అశోక్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో నవంబర్ 23న అర్ధరాత్రి తన రేకుల గదిలో చీరతో ఉరేసుకున్నాడు. అశోక్ మరణవార్త తెలుసుకున్న అతడి సోదరుడు రాజు ఘటనా స్థలానికి చేరుకొని చూడగా, అప్పటికే అశోక్ మృతి చెంది ఉన్నాడు. భార్య, పిల్లలు దూరమయ్యారనే బాధతోనే అశోక్ ఆత్మహత్య చేసుకున్నాడని, అతడి మృతిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని సోదరుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు సిద్దిపేట టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.