భక్తజన సంద్రంతో కిటకిటలాడిన చాకరిమెట్ల ఆంజనేయ స్వామి దేవస్థానం
కార్తీక దీపాలతో దేదీప్యమానంగా వెలిగిన స్వామివారి ఆలయం
చాకరిమెట్ల నవంబర్ 24 (విజయక్రాంతి): శివంపేట మండలం చిన్నగొట్టిముక్కుల గ్రామపంచాయతీ పరిధిలోని చాకరిమెట్ల శ్రీ స్వయంభూ సహకార ఆంజనేయ స్వామి(Sri Swayambhu Sahakara Anjaneya Swamy Temple) వారి దేవస్థానం భక్తజన సంద్రంతో కిటకిటలాడింది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు.
కార్తీక మాసం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించడంతో దేవస్థానం దీపకాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోయింది. భక్తుల హనుమాన్ నామస్మరణలు, ఆధ్యాత్మిక వాతావరణంతో ఆలయం పులకించిపోయింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సారా శ్రీనివాస్, ఆలయ ఫౌండర్ చైర్మన్ ఆంజనేయ శర్మ, రాజ్య ప్రభు శర్మ, రమేష్ శర్మ, దత్తు శర్మ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలని ఆకాంక్షించారు.