కార్తీక పౌర్ణమి సందర్భంగా సంగమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు

24-11-2026 | 11:09pm

మహాశివునికి గంగాజల అభిషేకం నిర్వహించిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండారి గంగాధర్ దంపతులు

శివంపేట నవంబర్ 24 (విజయక్రాంతి): మెదక్ జిల్లా శివంపేట మండలం పెద్దగొట్టిముక్కుల గ్రామంలోని పురాతన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సంగమేశ్వర ఆలయం(Sangameswara Temple)లో కార్తీక పౌర్ణమి సందర్భంగా మహాశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండారి గంగాధర్ దంపతులు స్వామివారికి గంగాజలంతో అభిషేకం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించి మహాశివుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆ పరమశివుని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

మరిన్ని వార్తలు