జోగులాంబ క్షేత్రంలో వైభవంగా జ్వాలా తోరణం, దీపోత్సవం
24-11-2026 | 11:33pm
అలంపూర్, నవంబర్ 24: కార్తీక పౌర్ణమి సందర్భంగా అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం(Alampur Jogulamba Temple)లో మంగళవారం రాత్రి జ్వాలా తోరణం, దీపోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జ్వాల తోరణాలను అర్చకులు వెలిగించారు.అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని జ్వాలా తోరణం కింద నుంచి దాటి మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం తుంగభద్ర పుష్కర ఘాట్ వద్ద దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. జ్వాలా తోరణం కింద నుంచి దాటితే పాపాలు, దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.దీంతో జోగులాంబ క్షేత్రం భక్తిభావంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.